Fact Check: రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ.20 లక్షలు సంపాదించవచ్చంటూ నిర్మలా సీతారామన్ పేరుతో న్యూస్ వైరల్, క్లారిటీ ఇచ్చిన PIB

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఒక ప్రకటనలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సుధా మూర్తి.. క్వాంటం AI ప్రాజెక్ట్ ద్వారా రూ. 21 వేల ప్రారంభ పెట్టుబడితో నెలకు 20 లక్షల వరకు లాభాలు పొందవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రకటన వినియోగదారులను రెండు రోజుల్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానిస్తూ వైరల్ అవుతోంది.

PIB Debunks Fake Nirmala Sitharaman Investment Ad (Photo Credits: X/ @PIBFactCheck)

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఒక ప్రకటనలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సుధా మూర్తి.. క్వాంటం AI ప్రాజెక్ట్ ద్వారా రూ. 21 వేల ప్రారంభ పెట్టుబడితో నెలకు 20 లక్షల వరకు లాభాలు పొందవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రకటన వినియోగదారులను రెండు రోజుల్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానిస్తూ వైరల్ అవుతోంది. ఈ ప్రకటనలో సుధా మూర్తి, నిర్మల సీతారామన్ ఫొటోలు, పథకం ఫలితాలు కూడా చూపించారు.ప్రజల్లో ఈ పథకం చట్టబద్ధతపై అనుమానం, ఆందోళనలు నెలకొన్నాయి.

వీడికి ఇదేమి పోయేకాలం.. రీల్ కోసం రైలు పట్టాలపై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇది నకిలీ అని ధృవీకరించింది. PIB ప్రకారం చిత్రాలు AI ద్వారా సృష్టించారు. ఆర్థిక మంత్రి లేదా సుధా మూర్తి ఈ పథకాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విధమైన కథనాన్ని ప్రచురించలేదని PIB స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది. నకిలీ పోస్టులను షేర్ చేయవద్దని కోరింది. వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది అని సురక్షితం కానిది అని స్పష్టం చేసింది.

Fact Check:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement