Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్, అధికారికంగా ధృవీకరించిన బిసిసిఐ కార్యదర్శి జే షా, ట్వీట్ ఇదిగో..
భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) యొక్క మెంటార్. నైట్ రైడర్స్ ఐపిఎల్ 2024 గెలిచిన టీంకు కోచ్.
Gautam Gambhir Named New Head Coach of Indian Men’s Cricket Team: భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) యొక్క మెంటార్. రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతను గౌతం గంభీర్ తీసుకోనున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ) కార్యదర్శి జే షా ధృవీకరించారు. అతనితో ఉన్న చిత్రాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఆహ్వానిస్తున్నట్లు షా ట్విటర్‌లో పేర్కొన్నారు. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్ అనంతరం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్ త్వరలో శ్రీలంకతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టనుండటంతో కేకేఆర్ మెంటార్షిప్‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేకేఆర్ గంభీర్ స్థానాన్ని రాహుల్ ద్రవిడ్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ ద్రావిడ్‌పై ప్రశంసలు కురిపించిన రోహిత్ శర్మ, ఇంతకీ ఏమన్నాడంటే..
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)