Hanuman Drone Video: వీడియో ఇదిగో, దసరా ఉత్సవాలను ఆకాశంలో ఎగురుతూ చిత్రీకరించిన హనుమంతుడు, వైరల్ అవుతున్న ఆంజనేయుడి డ్రోన్
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు డ్రోన్ రూపంలో ఎగురుతూ కనిపించాడు. విషయంలోకి వెళితే..అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు డ్రోన్ రూపంలో ఎగురుతూ కనిపించాడు. విషయంలోకి వెళితే..అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు. అయితే, మామూలుగా అయితే మజా ఏముంటుందని భావించిన నిర్వాహకులు ఆ డ్రోన్ అచ్చం గాల్లో ఎగురుతున్న ఆంజనేయుడిలా తీర్చిదిద్దారు. గాల్లో ఎగురుతున్నట్టుగా ఉన్న ఆంజనేయుడి ప్రతిమను తయారుచేసి దానికి బిగించారు.
అంబికాపూర్‌లోని మహామాయ ఆలయం వద్ద జరిగిన భారీ ఊరేగింపును ఈ ఆంజనేయుడి డ్రోన్‌తో చిత్రీకరించారు. గాల్లో ఎగురుతున్న ‘హనుమంతుడి’ని చూసిన జనం కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. కింద ఊరేగింపును బంధిస్తున్న డ్రోన్‌ను జనం తమ సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ హనుమాన్ డ్రోన్ నెట్టింట వైరల్‌గా మారింది.
Here's Viral Video