Women's Asia Cup T20 2024: ఆసియా క‌ప్‌ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు

Indian Woman Team (Photo-BCCI)

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు. 11వ ఓవ‌ర్లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. దాంతో, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ బృందం 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. త‌ద్వారా ఏడుసార్లు చాంపియ‌న్ అయిన టీమిండియా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.  నువ్వో పోరాట యోధుడివి, ధైర్యంగా ఉండు, క్యాన్సర్‌తో పోరాడుతున్న అంశుమన్‌ గైక్వాడ్‌పై కపిల్‌దేవ్‌ ఎమోషనల్‌ పోస్టు ఇదిగో..

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement