టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి విదితమే. అతడు త్వరగా కోలుకోవాలని మాజీ దిగ్గజం కపిల్‌దేవ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. మైదానంలో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ కపిల్ దేవ్ వీడియో ఎమోషనల్ వీడియో సందేశం పెట్టాడు. వీడియోలో అంశూ.. నువ్వు జీవితంలో చాలా కష్ట సమయంలో ఉన్నావని తెలుసు. అయితే.. మనందరం జీవితాల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్లమే. నేను నీ కెప్టెన్సీలో ఆడిన రోజులు గుర్తున్నాయి. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. నువ్వు జలంధర్‌లో పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ సాధించావు. కఠిన పరిస్థితులు వస్తుంటాయి.. పోతుంటాయి. భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..
కానీ.. నువ్వో పోరాట యోధుడివి. ధైర్యంగా ఉండు. త్వరగా కోలుకోవాలి’’ అని కపిల్ దేవ్ వీడియో సందేశం పెట్టాడు. క్యాన్సర్‌పై పోరాటాన్ని కొనసాగించాలని.. తాము అంతా వెంట ఉన్నామని భరోసా ఇచ్చాడు.కాగా గైక్వాడ్ విషయంలో సహాయం చేయాల్సిందిగా కపిల్ దేవ్ అప్పట్లో బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో బోర్డు అతడి వైద్య ఖర్చుల కోసం రూ. కోటి సాయం చేసింది. అంశుమన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అనంతరం టీమ్‌ఇండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత ఇతని కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
Here's Video
From Kapil Dev to Aunshuman Gaekwad...both played under each other's captaincy. Today, Aunshuman is battling cancer and we all pray he recovers. I gave up drinking ten years ago. Won't mind a drink with a friend who has a generous heart. Get well soon Aunshu... pic.twitter.com/i8eatv1ZS5
— Vijay Lokapally 🇮🇳 (@vijaylokapally) July 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)