వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని తెలిపారు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది.

టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్‌ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్‌ఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)