India vs England Semi Final: భారత్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు, టాస్ ఆలస్యం, మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు..
వర్షం కారణంగా గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. గురువారం ఉదయం నుంచే గయానాలో వాన దంచడం మొదలెట్టింది
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆలస్యం కానుంది. వర్షం కారణంగా గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. గురువారం ఉదయం నుంచే గయానాలో వాన దంచడం మొదలెట్టింది. దాంతో, అక్కడి ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లోని పిచ్‌ను పూర్తిగా కప్పేశారు. వర్షం వల్ల సెమీఫైనల్స్ రద్దయితే..సౌతాఫ్రికా- భారత్ మధ్యనే ఫైనల్, వర్షం పడి మ్యాచ్‌లు రద్దయితే ఏం జరుగుతుందంటే..
వాన తగ్గాక ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వచ్చారు. అయితే.. అంతలోనే మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో, అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తారు. ఔట్ ఫీల్డ్ బాగా తడిగా ఉంటే మ్యాచ్ రద్దయ్యే చాన్స్ ఉంది. అదే జరిగితే గ్రూప్ దశలో, సూపర్ 8లో అజేయంగా ఉన్న రోహిత్ బృందం ఫైనల్‌కు దూసుకెళ్లుంది. అప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లాలనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరైనట్టే.
Here's ICC Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)