South Africa

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ (South Africa vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత రాత్రి 08:00 గంటలకు భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్లు తలపడనున్నాయి. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

గ్రూప్ 1 నుంచి భార‌త్ (India), అఫ్గ‌నిస్థాన్‌లు, గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా (South Africa)లు టైటిల్ పోరుకు వెళ్లాల‌నే కసితో ఉన్నాయి.అయితూ తొలి సెమీస్‌కు మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డే (Reserve Day)ను కేటాయించింది. ఒక‌వేళ‌ వ‌ర్షం కార‌ణంగా ఆట సాగ‌కుంటే మ‌రునాడు అంటే 28వ తేదీ శుక్ర‌వారం య‌థావిధిగా ఆడిస్తారు.  ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు

ఆ రోజు కూడా మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డుప‌డితే అద‌నంగా 3 గంట‌ల స‌మ‌యం ఇస్తారు. అయినా ఔట్‌ఫీల్డ్ త‌డిగా ఉంటే మ్యాచ్ జ‌ర‌ప‌డం క‌ష్ట‌మని రిఫ‌రీలు భావిస్తే.. అది ద‌క్షిణాఫ్రికాకు క‌లిసొస్తుంది. గ్రూప్ ద‌శ నుంచి సూప‌ర్ 8 వ‌ర‌కూ ఓట‌మ‌నేది ఎరుగ‌కుండా అగ్ర‌స్థానంలో ఉన్న స‌ఫారీలు ఫైన‌ల్లో అడుగుపెడుతారు.ఆప్ఘన్లు ఇంటిదారి పడతారు.

ఇక రెండో సెమీస్ అయిన భార‌త్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజ‌ర్వ్ డే లేదు. వాన కార‌ణంగా మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగితే అద‌నంగా 250 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తారు. అప్ప‌టికీ వాన త‌గ్గినా ఔట్‌ఫీల్డ్ అనువుగా లేకుంటే గ్రూప్ ద‌శ‌లో టాప్‌లో ఉన్న టీమిండియా నేరుగా ఫైన‌ల్‌కు దూసుకెళ్లే అవ‌కాశ‌ముంది. ఇంగ్లండ్ ఇంటిదారి పడుతుంది.