టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 Worldcup)లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 8 ర‌న్స్ తేడాతో గెలుపొందింది.దీంతో నేరుగా వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు పాయింట్లు మాత్ర‌మే సాధించిన ఆస్ట్రేలియా జ‌ట్టు టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో ఆసీస్ సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్‌-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరింది.  అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికార్డులు ఇవిగో..

బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నాలుగు సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-1 నుంచి భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్‌ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు ఢీకొంటాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)