ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా (Australia) జట్టు నిష్క్రమించిన తర్వాత వార్నర్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన అతను.. ఇప్పుడు టీ20ల నుంచి కూడా వైదొలిగాడు. తన కెరీర్‌లో ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావొచ్చని గతంలో చెప్పినట్లుగానే అతను ఈ పొట్టి ఫార్మాట్‌కు స్వస్తి పలికాడు.
2025లో జరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని.. తన అవసరం ఉందనుకుంటే మాత్రమే ఆడుతానన్నాడు. వార్నర్ 2023లో వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టు ఆసిస్ జట్టులో డేవిడ్ వార్నర్ సభ్యుడు. జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ వార్నర్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో 510 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీడియో ఇదిగో, పరుగు కోసం రానందుకు సహచర ఆటగాడిపై బ్యాట్ విసిరికొట్టిన రషీద్‌ఖాన్, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..
ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలున్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 500కు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా నిలిచాడు. వార్నర్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. తాజాగా టీ20ల నుంచి సైతం తప్పుకున్నట్లు ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం జీవితాన్ని కుటుంబం కోసం కేటాయిస్తానని చెప్పాడు. కుటుంబానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
ఇప్పటివరకూ 110 అంతర్జాతీయ టీ20లు ఆడిన వార్నర్ 3277 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకంతో పాటు 28 అర్థశతకాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసి.. ఈ ఫీట్ సాధించిన మూడో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఐపీఎల్ సహా ఇతర టీ20 లీగుల్లోనూ అద్భుతంగా రాణించిన వార్నర్.. 2021లోనే పొట్టి ఫార్మాట్‌లోనే 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
వార్నర్ కెరీర్‌లో 112 టెస్టులు ఆడి 44.58 సగటుతో 8,766 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్. ఇక వన్డేల్లో ఇప్పటి వరకు 161 మ్యాచ్‌లు ఆడి.. 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 110 మ్యాచ్‌లల్లో 3,277 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికాడు కాబట్టి, ఐపీఎల్‌లో తన సేవల్ని మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తాడని ఆశించొచ్చు.