MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??

ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు.

MP Marriage Viral (Credits: X)

Indore, Dec 11: ప్రేమించిన అమ్మాయిని పెండ్లి (Marriage) చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న (నేడు) జరుగబోతున్నది. వీరిద్దరూ స్పెషల్‌ మ్యారే జ్‌ యాక్ట్‌ ప్రకారం పెండ్లి చేసుకుని, ఫ్యామిలీ కోర్టు (Family Court) నుంచి వివాహ ధ్రువపత్రాన్ని గురువారం స్వీకరించారు. ఆస్తా, అల్కా సోని మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ కు చెందినవారు. అల్కా జన్మతః స్త్రీ. అయితే కొన్నేండ్ల తర్వాత తాను స్త్రీని కాదని, పురుషుడిననే భావన ఆమెకు కలిగింది. అప్పటి నుంచి ఆమె తన పేరు అస్తిత్వగా మార్చుకొన్నది. అస్తిత్వ సోదరితో ఆస్తాకు స్నేహం ఉంది. దీంతో ఆస్తా ఆ అన్నా చెల్లెళ్ల ఇంటికి వెళ్తూ ఉండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నేడే పెండ్లి జరుగనున్నది.

Sabarimala Timings: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు గంట పొడిగింపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement