Chalamalasetty Ramesh Babu on Allu Arjun: నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు
అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు
అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే, ఇది మాత్రం ఫిక్స్, పుష్ప 2: ది రూల్ అభిమానులకు అంకితమంటూ అల్లు అర్జున్ బూస్ట్ వ్యాఖ్యలు
ఎన్నో సంఘసేవలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి. నువ్వు నీడ నిచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావు. నువ్వు మీ నాన్న కనీసం పిల్లికి కూడా బిక్షం వెయ్యరు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్, కళ్యాణ్ నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. డిసెంబర్ నెలలో నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూపిస్తా. కనీసం నీ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరని మండిపడ్డారు. ఇక అల్లు అర్జున్ కి, మా పార్టీకి ఎలాంటి శతృత్వం లేదు. మొన్న అతను మమల్ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆయన మళ్లీ ఏదైనా మాట్లాడితే నేను కౌంటర్ ఇస్తానని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
Here's Videos