Japanese Dog Kabosu Dies: క్రిప్టో ఐకాన్‌, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్‌ శునకం

క్రిప్టో కరెన్సీ ఐకాన్‌ గా, మీమ్స్‌ ప్రపంచంలో చింటూగా సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబొసు (17) శుక్రవారం మరణించింది.

Kabosu (Credits: X)

Newdelhi, May 25: క్రిప్టో కరెన్సీ ఐకాన్‌ గా, మీమ్స్‌ ప్రపంచంలో చింటూ (Chimtu)గా సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబొసు (17) శుక్రవారం మరణించింది. కబొసు వైరల్‌ మీమ్‌ చిత్రం 2013లో డాగీకాయిన్‌ (డొగ్‌) సృష్టికి స్ఫూర్తిగా నిలిచింది. 2010లో కబొసు ఫొటో మొదటిసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 2013 నాటికి కబొసు మీమ్స్‌ కు ప్రజాదరణ పెరగడంతో డాగీకాయిన్‌ కబొసు చిత్రాన్ని తమ అధికారిక చిహ్నంగా మార్చింది. సోషల్ మీడియాలో చింటూ పేరిట ఈ కుక్క ఫోటోతో వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోలు ఓ పెద్ద ఉప్పెన. కాగా.. 2022లో కబొసు అనారోగ్యం బారిన పడినప్పుడు అభిమానులు వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు కూడా.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)