Karnataka: దయచేసి నన్ను ఆపిన సెక్యూరిటీ గార్డుని ఉద్యోగం నుంచి తీయకండి, మంచి మనసు చాటుకున్న రైతు
బెంగళూరులో ధోతీ ధరించి మాల్ కు వచ్చిన ఓ రైతును సెక్యూరిటీ గార్డు లోనికి అనుమతించని విషయం తెలిసిందే.
రైతు వేషధారణ కారణంగా ప్రవేశం నిరాకరించబడిందనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం గురువారం ఇక్కడ ఒక మాల్‌ను ఏడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. బెంగళూరులో ధోతీ ధరించి మాల్ కు వచ్చిన ఓ రైతును సెక్యూరిటీ గార్డు లోనికి అనుమతించని విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక ప్రభుత్వం రైతును అవమానించి "గౌరవం మరియు ఆత్మగౌరవానికి" భంగం కలిగించిందని, దీనిని సహించలేమని పేర్కొంది. బెంగుళూరులో దారుణం, ధోతి ధరించిన రైతును థియేటర్‌లోకి అనుమతించని సెక్యూరిటీ గార్డు, వీడియో ఇదిగో..
ఇదిలా ఉంటే మాల్ సెక్యూరిటీ గార్డును కూడా తొలగిస్తారన్న వార్తలపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు. 'నన్ను ఆపిన ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని విన్నాను. దయచేసి అలా చేయకండి. అతడికీ ఓ కుటుంబం ఉంటుంది కదా' అని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన మంచి మనసు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)