Kerala Lesbian Couple: బీచ్‌లో ఉంగరాలు మార్చుకుని ఒక్కటైన స్వలింగ సంపర్కుల జంట, సోషల్ మీడియాలో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు వైరల్

కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు బీచ్‌లో ఒక్కటయ్యింది. బీచ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

Kerala lesbian couple (Photo/Instagram)

కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు బీచ్‌లో ఒక్కటయ్యింది. బీచ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతో నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్‌జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్‌లో వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లోనే ఇద్దరూ రింగ్‌లు మార్చుకుని ఒక్కటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కన్పిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా స్వలింగ సంపర్క వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్దత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు.

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by Adhila Nasarin (@adhila_noora)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement