Tamilnadu: మధురై సెంట్రల్ జైలులో పోలీస్ కుక్క(DSP) మృతి, పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళి అర్పించిన సిబ్బంది
తమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది.
తమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది. జైలు ఆవరణలో 21 తుపాకీలతో సెల్యూట్ సహా పూర్తి పోలీసు గౌరవాలతో అంతిమ నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మధురై సెంట్రల్ జైలు పోలీసులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా నెటిజన్లు సైతం నివాళి అర్పిస్తున్నారు.
పోలీసు విచారణలో కీలకం మారుతున్నాయి డాగ్ స్వ్కాడ్ సేవలు. ఇప్పటికీ కొంతమంది కీలక నేరస్తులను పట్టించాయి జాగిళాలు. అంతేగాదు ప్రముఖులు ఏదైనా సభకు లేదా చోటుకు వస్తున్నారంటే ముందుగా పోలీసులతో పాటు తనిఖీలకు వచ్చేవి జాగిలాలే. అలాంటి జాగిలాలు మరణించినప్పుడు పోలీసులు తగిన గౌరవంతో నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)
Madurai Prison DSP-Rank Dog Passes Away.. Here are the details