Mizoram: అపాయింట్‌మెంట్ లేకుండా వైద్యం చేయనని తెలిపిన వైద్యుడు, అతని చెంప పగలగొట్టిన మిజోరాం ముఖ్యమంత్రి కూతురు, ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆమె తండ్రి సీఎం జోరంతంగా
దీంతో మిజోరం సీఎం జోరంతంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మిజోరం సీఎం జోరంతంగా కూతురు మిలారీ చాంగ్టే, ఐజ్వాల్‌లోని చర్మవాధుల క్లినిక్‌కు బుధవారం వెళ్లింది.
మిజోరం ముఖ్యమంత్రి కుమార్తె ఒక డాక్టర్‌ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మిజోరం సీఎం జోరంతంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మిజోరం సీఎం జోరంతంగా కూతురు మిలారీ చాంగ్టే, ఐజ్వాల్‌లోని చర్మవాధుల క్లినిక్‌కు బుధవారం వెళ్లింది. అయితే అపాయింట్‌మెంట్ లేనిదే తాను వైద్యం చేయనని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మిలారీ ఆ వైద్యుడి చెంప, ముఖంపై కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మిజోరం యూనిట్ ఈ సంఘటనను ఖండించింది. సీఎం కుమార్తె డాక్టర్‌ను కొట్టడంపై వైద్యులు నిరసన తెలిపారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మిజోరం సీఎం జోరంతంగా చివరకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆమె ప్రవర్తనను తాను ఏ విధంగానూ సమర్థించబోనని తెలిపారు. ఈ మేరకు చేతితో రాసిన లేఖను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)