Team India Victory Parade: వీడియో ఇదిగో, ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద పోటెత్తిన జన సముద్రం, టీమిండియాకు గ్రాండ్ వెల్ కం చెప్పిన అభిమానులు

తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.

Fans Gathered at Marine Drive for Team India’s Victory Parade Make Way for Ambulance Ahead of Rohit Sharma’s T20 World Cup Winning Team’s Arrival (Watch Video)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత భారత జట్టు ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా అందించనుంది.

కాగా, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖేడే స్టేడియం వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అటు, వాంఖెడే స్టేడియంలోనూ అభిమానులు పోటెత్తారు.  రోహిత్‌ శర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో, స్థానిక మహిళలతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్, ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న భారత జట్టు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement