Taylor Swift Madrid Show: టేలర్ స్విఫ్ట్ మాడ్రిడ్ షోలో ఏలియన్..? వీడియో వైరల్
మాడ్రిడ్‌లో జరిగిన టేలర్ స్విఫ్ట్ రీసెంట్ మ్యూజిక్ షో జరుగుతున్న సమయంలో స్టేడియం పై కప్పుపై ఓ రహస్యమయ ఆకారం కనిపించింది. మనిషిలానే ఉన్న ఆ ఆకారం కూడా టేలర్ స్విఫ్ట్ పాటకు డాన్స్ చేస్తున్నట్లు....
ఎవరా వ్యక్తి..? అక్కడెందుకున్నాడు..? అసలు అక్కడికెలా వెళ్లాడు..? టేలర్ స్విఫ్ట్ మాడ్రిడ్ కాన్సర్ట్‌కు సంబంధించి వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి అనుమానం ఇదే. అసలేం జరిగిందంటే.. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ ఈ మధ్య మాడ్రిడ్‌లో ఓ భారీ కాన్సర్ట్ అంటే మ్యూజిక్ షో నిర్వహించింది. ఈ క్రమంలోనే లక్షల మంది ఫ్యాన్స్ ఆమె షో చూడడానికి చేరుకున్నారు. స్టేజ్‌పై స్విఫ్ట్ పాడుతుంటే.. చుట్టు ఉన్న ఫ్యాన్స్ అంతా మంత్రముగ్ధులై ఆమె పాటను ఆనందిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇదంతా అక్కడికొచ్చిన ఓ ఫ్యాన్స్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీస్తున్న సమయంలో అనుకోకుండా స్టేడియం రూఫ్ టాప్‌పై ఓ మిస్టీరియస్ ఆకారం కనిపించింది. ఇంటర్నెట్ రాగానే పోర్న్‌కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు
మనిషిలానే ఉన్న ఆ ఆకారం కూడా టేలర్ స్విఫ్ట్ పాటకు డాన్స్ చేస్తున్నట్లు అటు ఇటూ ఊగుతోంది. 16 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అంతా ఆ వ్యక్తి ఎవరా..? అసలు మనిషేనా..? లేక ఏలియనా..? అని తెలుసుకునే పనిలో పడ్డారు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)