India-Bharat Name Row: ఇండియా పేరును భారత్ వద్దనుకుంటే పాకిస్తాన్ ఆ పేరును పెట్టుకుంటుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఇదిగో..
భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందని సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది.
ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న సంగతి విదితమే. తాజాగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందని సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది.
ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో మార్చుకుని భారత్ అని నామకరణం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే పాకిస్తాన్ దేశం తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా తెలిపినట్లు అందులో రాశారు.
ఈ పోస్టుపై సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పేరు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరు పెట్టుకుంటుంది. అపుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ పేరును పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారొక యూజర్. మరో వ్యక్తి అయితే పెరు మారినా పాకిస్తాన్ తలరాత మాత్రం మారదులే అని రాశారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని రాశారు.
Here's Viral Tweet
Here's Virender Sehwag Reaction
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)