Fayyaz-ul-Hassan Chohan: పళ్లతో కొరికి రిబ్బన్ కట్ చేసిన పాకిస్తాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్, కత్తెర పదునుగా లేకపోవడంతో ఘటన, వైరల్ అవుతున్న క్లిప్
ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బన్‌ను కత్తెరతో కాకుండా పళ్లతో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (Goes Viral in Social Media) అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్తగా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ (Fayyaz-ul-Hassan Chohan) వెళ్లారు.
ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బన్‌ను కత్తెరతో కాకుండా పళ్లతో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (Goes Viral in Social Media) అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్తగా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ (Fayyaz-ul-Hassan Chohan) వెళ్లారు. దుకాణ ప్రవేశ ద్వారం వద్ద కట్టిన రిబ్బన్ ను ఆయన కట్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహకులు కత్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ కత్తెర పదునుగా లేదు. ఎంతగా ట్రై చేసినా అది కట్ కాలేదు. దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ పళ్లతోనే రిబ్బన్ ను పరపరా కట్ చేసిపారేశారు. అది చూసి, అక్కడున్న వారు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. మరోపక్క, ఆయన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.