Paralympics 2024 Google Doodle: నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్
సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి
పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024: సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్‌ను జోడించారు. ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంధర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)