Rohit Sharma Gets Emotional: భారత్ ఫైనల్ చేరగానే ఏడ్చేసిన రోహిత్ శర్మ, భుజం తట్టి ఓదార్చిన విరాట్ కోహ్లీ
టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆనందంలో సారధి రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న అతడిని కోహ్లీ భుజం తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆనందంలో సారధి రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న అతడిని కోహ్లీ భుజం తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్, ఇంగ్లండ్‌పై 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా
ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 39 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్.. తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 32వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అటు సూర్యకుమార్ యాదవ్ (47) తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించడంతో టీమిండియా 171 పరుగుల భారీ స్కోర్ చేయగలింది. ఆ తర్వాత అక్సర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన స్పెల్‌లు ఇంగ్లండ్‌ను 103 పరుగులకే పరిమితం చేశాయి. ఈ విజయంతో ఫైనల్ చేరిన భారత జట్టు శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)