Lizard Inside Samosa: సమోసాలో బల్లి.. తినబోయి షాకైన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో

(Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్‌ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది.

Lizard Inside Samosa (Credits: X)

Newdelhi, Nov 17: ఒక స్వీట్‌ షాపు (Sweet shop) నుంచి కొనుగోలు చేసిన సమోసాలో (Samosa) బల్లి (Lizard) కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్‌ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని హాపూర్‌ లో ఈ సంఘటన జరిగింది. దీపావళి సందర్భంగా ఒక వ్యక్తి ఇంటికి బంధువులు వచ్చారు. ఈ నేపథ్యంలో అతడు చాందీ రోడ్‌ లో ఉన్న స్వీట్ షాప్ నుంచి సమోసాలు కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చిన బంధువులకు ఆ సమోసాలు పెట్టాడు. కాగా, ఆ వ్యక్తి ఒక సమోసా తినబోగా అందులో బల్లి ఉండటాన్ని గమనించాడు. ఇది చూసి అతడితోపాటు బంధువులు కూడా షాక్‌ అయ్యారు. సమోసా తిన్న 13 ఏళ్ల కుమార్తె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.

Sabarimala Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. 41 రోజులపాటు శబరిమల యాత్ర సీజన్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)