Hunger Strike: ఇబ్బందులు పడుతున్నాం.. గృహహింస చట్టాలను సవరించండి.. భార్యాబాధితుల సంఘం సభ్యుల నిరాహార దీక్ష

గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకునిభార్యలు అనవసరంగా భర్తలను వేధించడం పనిగా పెట్టుకుంటున్నారని, విదేశాల్లో ఉంటున్న భర్త తరపు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని భార్య భాధితుల భర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

Credits: Twitter

Bangalore, Feb 26: గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని భార్యలు అనవసరంగా భర్తలను వేధించడం పనిగా పెట్టుకుంటున్నారని, విదేశాల్లో ఉంటున్న భర్త తరపు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని భార్య భాధితుల భర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు భార్యాబాధితుల సంఘం సభ్యులు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. గృహ హింస చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’తో కలిసి నిరాహార దీక్షకు దిగారు. చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement