MLA Jaggareddy: అన్నా నీవు రాజీనామా చేయకు, జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన వీహెచ్ హనుమంతరావు

పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి... నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్... వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.

Sangareddy MLA Jaggareddy (Photo-Video grab)

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ అసంతృప్తి గళం వినిపిస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా లేఖలు సంధించడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రంగంలోకి దిగారు. వీహెచ్ ను జగ్గారెడ్డి ఓ హోటల్ లో కలిశారు. అయితే, అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి... నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్... వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఇదంతా ఓ సోఫాలో కూర్చుని వీహెచ్ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈ తతంగంపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement