Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??
శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
Tirumala, Aug 25: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం (Shravana Shukravaram).. వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.