శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. ఈ దేవత పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. వరలక్ష్మీ వ్రతం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పేయండి
ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారతదేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ విషెస్ చెప్పేయండి ఈ అద్భుతమైన కొటేషన్లతో..
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల మెసేజీలు, సందేశాలు మీకోసం..
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల మెసేజీలు, సందేశాలు మీకోసం..
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల మెసేజీలు, సందేశాలు మీకోసం..
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల మెసేజీలు, సందేశాలు మీకోసం..
స్త్రీలు లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పూజించడం ఆనవాయితీ. కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వంటి ప్రదేశాలలో కూడా లక్ష్మిని పూజిస్తారు. ఈ పూజలో ప్రతి ఇంటిలోని స్త్రీలు నిండుగా, సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొంటారు.