School Bus Driver Saves Students: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటు, విద్యార్థులు గుర్తుకువచ్చి రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్ మీద కుప్పకూలి డ్రైవర్ మృతి, అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ సంతాపం తెలిపిన సీఎం స్టాలిన్
స్కూలు బస్సు డ్రైవింగ్ చేస్తుండగా బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అయితే బస్సులో పిల్లలు ఉన్నారనే సంగతి గుర్తించుకుని వాహనాన్ని ఓ పక్కకు నిలిపి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విద్యార్థుల ప్రాణాలు కాపాడిన అతనిపై సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు
స్కూలు బస్సు డ్రైవింగ్ చేస్తుండగా బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అయితే బస్సులో పిల్లలు ఉన్నారనే సంగతి గుర్తించుకుని వాహనాన్ని ఓ పక్కకు నిలిపి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విద్యార్థుల ప్రాణాలు కాపాడిన అతని సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఘటనలోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లా గంగేయం నివాసి మలయప్పన్ ప్రైవేట్ స్కూల్ బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది. అతని పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, అతను వాహనంలో ఉన్న విద్యార్థుల భద్రతను నిర్ధారించి, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ప్రజలతో మాట్లాడుతుండగా ఎస్ఐకి ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన పోలీస్ అధికారి
ఆపిన వెంటనే స్టీరింగ్ ముందు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సంతాపాన్ని తెలియజేసారు, “అతను మరణం అంచున కూడా విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. మలయప్పన్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. అతను తన మానవతావాద పనికి కీర్తితో జీవిస్తాడంటూ ట్వీట్ చేశారు. మలయప్పన్ ధైర్యసాహసాలకు పలువురు మెచ్చుకుంటూ అతనికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
Here's CM Stalin Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)