Telangana: దారుణం, తల్లి,పెళ్ళాం అంటూ అసభ్యపదజాలంతో లారీ డ్రైవర్ మీద రెచ్చిపోయిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ దూషించారు.
లారీ డ్రైవర్ ని తల్లి, పెళ్ళాం అంటూ ఇష్టం వచ్చినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ దూషించారు. హైదరాబాద్ నగరంలో ఓ వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు. లారీ డ్రైవర్ ఒక వేళ తప్పు చేసి ఉంటే అతన్ని శిక్షించే విధానం ఇది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నగరాన్ని రక్షించాల్సిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలా తీవ్ర పదజాలంతో ప్రయాణికులు మీద తిరగబడటం పద్దతి కాదంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏకంగా పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఇన్‌స్టా రీల్..వీడియో వైరల్
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)