'Taffic Jam' On Mount Everest: మౌంట్ ఎవరెస్ట్ మీద భారీగా ట్రాఫిక్ జాం, సోషల్ మీడియాలో వీడియో వైరల్,
మౌంట్ ఎవరెస్ట్ మీద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకెళితే..రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.
మౌంట్ ఎవరెస్ట్ మీద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకెళితే..రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదు. ఇది ఎంతో కష్టతరమైన విషయం’ అని అందులో పేర్కొన్నాడు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ ను అధిరోహించగలరని పేర్కొన్నాడు.
1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటివరకు సుమారు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని వివరించాడు. రద్దీ వల్ల తాను కిందకు దిగడం ఓ పీడకలలా అనిపించిందని, కిందకు దిగే క్రమంలో నీరసించిపోయాయని చెప్పాడు. పర్వతారోహకులంతా తాళ్ల సాయంతో ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు ఇన్ స్టాలో సుమారు 30 లక్షల వ్యూస్, 18 వేల లైక్ లు లభించాయి.ఇదిలా ఉంటే రాజన్ ద్వివేదీ బృందంతో కలిసి ఎవరెస్ట్ ను అధిరోహించిన డేనియల్ పాటర్ సన్ అనే 39 ఏళ్ల బ్రిటన్ పర్వతారోహకుడితోపాటు నేపాలీ షెర్పా పాస్తెంజీ తిరుగు క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. గత మంగళవారం వారు కిందకు దిగుతండగా భారీ మంచు వారిపై పడింది. దీంతో వారు ఒక్కసారిగా జారి అగాథంలోకి పడిపోయారు. వారి జాడ తెలియరాలేదని బీబీసీ వార్తాసంస్థ తెలిపింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)