UP Horror: వ్యక్తి వెనుక పటాకులు కాల్చిన వైనం.. కుప్పకూలి మృతి.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఘటన (వీడియోతో)
ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
Newdelhi, Nov 14: వ్యక్తి వెనుక పటాకులు (Crackers) కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. (man dies after firecrackers thrown at him) ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో (Video) క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లింక్ రోడ్ ప్రాంతంలో దీపావళి సందర్భంగా ఒక వీధిలో కొందరు వ్యక్తులు ఉన్నారు. 40 ఏళ్ల వ్యక్తి, మరొకరు వారి వద్దకు వెళ్లారు. మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగారు. ఇంతలో ఆ గుంపులోని ఒకరు 40 ఏళ్ల వ్యక్తి వెనుక పటాకులు కాల్చాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. మృతుడ్ని 40 ఏళ్ల నాటు అలియాస్ అఫ్జల్ గా పోలీసులు గుర్తించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)