Viral Video: స్టేడియంలోనే ఉన్నా.. ఫోన్ లో మ్యాచ్ చూస్తున్నాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మీరూ చూడండి.
మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.
Newdelhi, May 15: క్రికెట్ మ్యాచ్ లను (Cricket Match) లైవ్ (Live) లో అదీ స్టేడియంలో (Stadium) చూడాలని అభిమానులు ఆశపడుతుంటారు. అలా ఆ చాన్స్ (Chance) దొరికిన వాళ్ల ఆనందానికి అవధులుండవు. అరుపులు, కేరింతలతో తమ టీమ్స్ ను సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రమైన ఘటన. స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను వదిలేసి ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న సీట్లను వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూస్తూ కనిపించాడు. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)