Virat Kohli's Portrait: భూతద్దంతో చెక్కను కాల్చి కోహ్లీ చిత్రం రూపొందించిన ఆర్టిస్ట్.. కళాకారుడి ఓర్పు, నేర్పుకు అబ్బురపడుతున్న నెటిజన్లు.. ఆ వీడియో మీరూ చూడండి!

ఇందుకోసం అతడు భూతద్దం ఉపయోగించడం విశేషం. భూతద్దం సాయంతో ఓ చెక్కపై సూర్యకిరణాలను కేంద్రీకరించి బోర్డు ఉపరితలం కాల్చి కోహ్లీ రూపాన్ని అతను డిజైన్‌ను చేశాడు.

Credits: Twitter

Newdelhi, May 8: విఘ్నేశ్ అనే ఆర్టిస్ట్ అసాధారణ రీతిలో చెక్కపై టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చిత్రాన్ని గీశాడు. ఇందుకోసం అతడు భూతద్దం ఉపయోగించడం విశేషం. భూతద్దం సాయంతో ఓ చెక్కపై సూర్యకిరణాలను కేంద్రీకరించి బోర్డు ఉపరితలం కాల్చి కోహ్లీ రూపాన్ని అతను డిజైన్‌ను (Design) చేశాడు. ఎంతో ఓర్పు, నేర్పుతో ఒడుపుగా అతడు ఈ చిత్రాన్ని గీస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందరూ ఆ కళాకారుడిని ప్రశంసిస్తున్నారు. ఇండియన్ ఆర్టిస్ట్స్ క్లబ్ వారు ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఈ వీడియోను (Video) షేర్ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.

Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??

 

View this post on Instagram

 

A post shared by Indian Artists Club ®️ (@indian_artists_club__)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)