Newdelhi, May 8: నిరుడు సామాన్యులను (Middle Class Consumers) బెంబేలెత్తించిన వంటనూనె (Cooking Oil) ధరలు (Prices) తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ (Russia- Ukraine) మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ధరలు 46 నుంచి 57 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల రిటైల్ మార్కెట్లో మాత్రం 16-17 శాతంగానే ఉండనుంది. కాగా, వంటనూనెల ధరలను తగ్గించాలని కంపెనీలకు ఇటీవలే కేంద్రం సూచించడం తెలిసిందే.
మరికొంత సమయం
ఉక్రెయిన్ నుంచి దిగుమతులు పెరగడంతో నిల్వలు కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్టు ఎస్ఈఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. అయితే, రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.