Pilot Touches Her Father's Feet: వైరల్ అవుతున్న తండ్రీకూతుళ్ల బెస్సింగ్ వీడియో, విమానం ల్యాండ్ అయిన తరువాత తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న పైలట్‌

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు.ఎయిర్‌బస్ 320కి చెందిన పైలట్ క్రుతద్న్యా హేల్ నడుపుతున్న విమానంలో ఆమె తండ్రి ప్రయాణించాడు.

Pilot Touches Her Father's Feet (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు.ఎయిర్‌బస్ 320కి చెందిన పైలట్ క్రుతద్న్యా హేల్ నడుపుతున్న విమానంలో ఆమె తండ్రి ప్రయాణించాడు. దీంతో థ్రిల్‌గా ఫీలైన ఆమె ఫ్లైట్‌ టేకాఫ్‌ ముందు తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. అనంతరం ప్రేమగా కౌగలించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన క్రుతద్న్యా ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. ‘టేకాఫ్‌కు ముందు మా నాన్న బ్లెస్సింగ్స్‌ తీసుకున్నా. నేను ఎప్పుడైనా సరే నా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లను. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మా తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉంటారు. అయినా వారి పాదాలను తాకకుండా నేను వెళ్లను’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Capt. Krutadnya Hale✈️ (@pilot_krutadnya)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement