Navdeep Saini: భారత్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకి స్టంప్ లేచి గాల్లో డ్యాన్స్ వేసింది,100 కిమీవేగంతో బంతిని విసిరిన స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ

ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది.

Navdeep Saini (Photo-Video Grab)

ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్‌ 92 వ ఓవర్‌లో తన 21వ ఓవర్‌ వేయడానికి వచ్చిన నవదీప్‌ సైనీ ఓవర్‌ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. హెండ్రిక్స్‌ దాన్ని వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను తాకడంతో స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్‌ స్టంప్‌, లెగ్‌ స్టంప్‌లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now