Scuba Diver Rescues Fish: వైరల్ వీడయో, సముద్రం అడుగుకు వెళ్లి చేపను రక్షించిన స్కూబా డైవర్, మనం వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాల్లో లెక్కలేనన్ని సముద్ర జీవులు చిక్కుకుంటున్నాయంటూ ట్వీట్
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పర్యావరణ పరిరక్షకుడు మైక్ హుదేమా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోలో సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని కదల్లేని స్థితిలో ఉన్న చేప కనిపించింది. ఆ చేపను వెంటనే సముద్ర సంరక్షణ సంస్థ, ది పెర్ల్ ప్రొటెక్టర్స్ సురక్షితంగా బయటకు తీసి నీటిలోకి వదిలారు.

వీడియో షేర్ చేసిన మైక్.. ‘ఈ డైవర్ ప్లాస్టిక్‌లో చిక్కుకున్న చేపను రక్షించాడు. లెక్కలేనన్ని సముద్ర జీవులు మనం వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాల్లో చిక్కుకుంటున్నాయి. చిన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కూడా నీటి అడుగున ప్రాణాంతకం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే సమయం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గత నెల 26న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Viral Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)