Vijayawada, July 13: ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప (Pulasa Chepa) రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో (Godavari Districts) ఈ పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేపల కోసం జాలర్ల వేట కూడా అదే స్థాయిలో సాగుతుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఇక ఆ జాలరికి పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. ఈ చేప మిగతా చేపల్లా ఈజీగా దొరకదు. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేప ఎంతో ప్రత్యేకమైంది. అలా ఇటీవల గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో ఓ పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మకిలిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజిన్నర బరువున్న పులస చేప పడింది.
కాటేసిన పామును ఏకంగా దవాఖానకు తీసుకొచ్చిన యువకుడు.. యూపీలో ఘటన.. వీడియో మీరూ చూడండి!
వలకు చిక్కిన తొలి పులస.. కేజిన్నర రూ. 24,000 రికార్డ్ ధర
పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత ఉంది.. గోదావరి నీళ్లలో వచ్చే పులసకు అంత డిమాండ్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు ఎర్ర నీళ్ల గోదావరిలో ఎదురెక్కిన కేజిన్నర… pic.twitter.com/jsbE5ST00Q
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
పులస చేపా.. మజాకా
చేప ఇలా చిక్కిందో లేదో.. దాన్ని కొనుగోలు చేసేందుకు అందరూ పోటీపడ్డారు. అయితే, చివరకు అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను రూ. 24 వేలకు ఈ కేజీన్నర చెప్పాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.