Wayanad Landslide: వీడియో ఇదిగో, వయనాడ్‌లో విలయంలో బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి

కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.

Wayanad Landslide man saved his life by holding a rock Video

కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తాజాగా వయనాడ్‌ కొండచరియల బీభత్సంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి బండరాయిని పట్టుకుని తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.  వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్

ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు బురద కారణంగా అక్కడినుంచి బయటపడలేకపోయాడు. కనీసం నిలబడలేని పరిస్థితుల్లో బండరాయిని పట్టుకుని అలాగే ఉండిపోయాడు.ఆయనను గమనించిన కొందరు స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా పరిస్థితులు అందుకు సహకరించలేదు. దీంతో ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపించాలని అధికారులను కోరారు. తక్షణమే స్పందించిన సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement