Saina Nehwal: ఇలాంటి వాటిని నేను పట్టించుకోను, హీరో సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందించిన సైనా నెహ్వాల్, మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని తెలిపిన బ్యాడ్మింటన్ స్టార్

సైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు.

Siddharth and Saina Nehwal (Photo Credits: Twitter)

సైనా నెహ్వాల్ పై సినీ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సిద్ధార్థ్ అనడంతో ఎంతో మంది విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సైనాకు సిద్ధార్థ్ క్షమాపణ చెప్పారు. మీ మీద వేసిన జోక్ కు క్షమాపణ చెపుతున్నానని... మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తే అది మంచి జోక్ కాదని అన్నారు. నువ్వు ఎప్పుడూ మా ఛాంపియన్ వేనని చెప్పారు. తన క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ నేపథ్యంలో సైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు. ఆయన క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement