Charanjit Singh Dies: భారత హకీలో తీవ్ర విషాదం, స్వర్ణపతకం అందించిన చరణ్ జిత్ సింగ్ కన్నుమూత, ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన కేంద్ర క్రీడల మంత్రి
ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు, చరణ్ జిత్ సారథ్యంలో ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించింది.
భారత ప్రఖ్యాత హాకీ ఆటగాడు చరణ్ జిత్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు, చరణ్ జిత్ సారథ్యంలో ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించింది. పద్మశ్రీ చరణ్ జిత్ ఇవాళ తువది శ్వాస విడిచినట్లు అనురాగ్ తెలిపారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలుమినస్ లో ఆయన ఉన్నారు. 1960లో రోమ ఒలంపిక్స్ లో ఇండియా సిల్వర్ మెడల్ గెల్చుకోవడంతో చరణ్ పాత్ర కూడా ఉంది. పంజాబ్ పోలీస్ విభాగంలో ఆయన సేవలు అందించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)