Women's Premier League: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్ల ఖరీదు రూ. 4669.99 కోట్లు, ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో దక్కించుకున్న పలు యాజమాన్యాలు, పూర్తి వివరాలు ఇవే..

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది

File Image | Indian Premier League Trophy | (Photo Credits: Twitter @IPL)

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. వేలంలో దాదాపు 30 బడా కార్పొరేట్లు పోటీపడినప్పటికీ అంతిమంగా ఈ ఐదు కంపెనీలకు ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు దక్కాయి.

1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)

2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)

3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)

4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement