Lok Sabha Election 2024: బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొహమ్మద్ షమీ, కాషాయపెద్దలు టీమిండియా పేసర్‌‌తో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు, ఇంకా షమీ నుంచి అధికారికంగా రాని ప్రకటన

భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

PM Modi Hugs Mohammed Shami After India Lose WC Final Vs Australia

టీమిండియా పేసర్‌ మొహమ్మద్ షమీ బీజేపీ తరపున రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.  రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి

అయితే షమీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పటికే బెంగాల్‌ మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, అశోక్ దిండా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో షమీ రాజకీయ ప్రవేశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం షమీ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు.షమీగా లోక్‌సభ ఎన్నికలో పోటీచేయాలని భావిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే ఛాన్స్‌ ఉంది.

Here's News