Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్‌ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, ఎగిరి అవతల పడిన వికెట్లు, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది.

asprit Bumrah Dismisses Ollie Pope With Sensational Yorker During IND vs ENG 2nd Test 2024

యార్కర్ల కింగ్‌, టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా మరోసారి అద్భుతమైన యార్కర్ తో మెరిసాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 28 ఓవర్‌లో బుమ్రా ఐదో బంతిని అద్బుతమైన ఇన్‌స్వింగర్‌ యార్కర్‌గా సంధించాడు. పోప్‌ తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో పోప్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif