IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్ గెలుపు, 2–0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హ్యారీ టెక్టర్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్‌రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)