Dinesh Karthik Retirement: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్‌లో నిజమెంత ? జియో సినిమా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇదిగో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగంతో..
రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఐపీఎల్ యాజమాన్యం సైతం డీకే రిటైర్‌మెంట్‌ని ఎక్స్ వేదికగా కన్ఫమ్ చేసింది.
16 ఏళ్ల క్రితం ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టిన దినేశ్ కార్తిక్.. మొత్తం ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడని, మరపురాని జ్ఞాపకాల్ని మిగిల్చాడని ‘జియో సినిమా’ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రెండో వికెట్‌కీపర్‌గా డీకే నిలిచాడని, ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ప్రదర్శనలు కనబర్చిన మూడో ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడని వెల్లడించింది. దినేశ్ కార్తిక్ గుడ్ బై చెప్తున్నట్టు ఓ పోస్టర్ కూడా ఈ ట్వీట్‌కి జత చేశారు.
ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత దినేశ్ కార్తిక్ తన ఆర్సీబీ ప్లేయర్స్‌ని ఆత్మీయంగా హత్తుకున్నాడు. తన చేతికి ఉన్న గ్లౌవ్స్ తీసి.. అభిమానులకు అభివాదం చేస్తూ, మైదానమంతా తిరిగాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన డీకే.. తనపై కురిపించిన అభిమానానికి గాను ఫ్యాన్స్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అతని వెనకాలే నడుస్తూ.. చప్పట్లు కొడుతూ అతనిలో ఉత్సాహం నింపారు. అటు.. ఫ్యాన్స్ కూడా తమకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, చప్పట్లతో మైదానం మొత్తం మార్మోగించేశారు. రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలు...ఈసారి కూడా కప్ పోయింది...అభిమానులకు తప్పని నిరాశ..కోహ్లీ ఫ్యాన్స్‌కు తీరని కల..
Here's Video and Jio Cinema Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)