IND vs SA: విరాట్ కోహ్లికి ఏమాత్రం పరిపక్వత లేదు, యువ క్రికెటర్లకు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు, కోహ్లీపై మండిపడిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

BJP MP Gautam Gambhir helps Pakistani child get visa for treatment in India (Photo-ANI)

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ డీఆర్‌ఎస్‌ కాల్‌, అందుకు కోహ్లి బృందం స్పందించిన తీరు ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్‌ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.

ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్‌... ‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్‌ స్టంప్స్‌ మైక్‌ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement