Haryana Pacer Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్, కేరళతో రంజీ ట్రోఫీలో అద్భుత బౌలింగ్..వీడియో ఇదిగో

రోహ్‌తక్‌లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. 10/49తో అద్భుత స్పెల్ వేసి ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.

Haryana pacer Anshul Kamboj picks all 10 wickets in Ranji match(X)

కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రోహ్‌తక్‌లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. 10/49తో అద్భుత స్పెల్ వేసి ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.

కాంబోజ్ కంటే ముందు బెంగాల్‌కు చెందిన ప్రేమాంగ్షు ఛటర్జీ (10/20) , రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం (10/78)తో ఈ ఫీట్‌ని సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్‌ను ముగ్గురు సాధించారు. జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్‌), అజాజ్ పటేల్ (న్యూజిలాండ్) - ఒక టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీశారు.  మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024, వరుసగా మూడో విజయంతో సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా హకీ జట్టు

Here's Video: