MLA Danam Nagender on IPL Tickets: పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్

ఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.

Danam Nagender (Photo/FB)

ఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ దందాపై ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇషాంత్ శ‌ర్మ కళ్లు చెదిరే యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు క్లీన్ బౌల్డ్‌తో కిందపడి విలవిలలాడిన ఆండ్రీ రస్సెల్

హైదరాబాద్‌లో టికెట్స్ దొరకకపోవడానికి ప్రధాన కారణం హెచ్‌సీఏ అని..హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ క్రీడా కారుడు ఉండేలా చూడాలన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. డేవిడ్ వార్నర్‌ ఫిక్సింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుండి తీసేసారు.సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడు.. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనివ్వను అని నఅ్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now